
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
కేశంపేట: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఫెడరేషన్ మండల అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో మండల పరిధి పాపిరెడ్డిగూడ, వేములనర్వ, కేశంపేట, కొత్తపేట జడ్పీ ఉన్నత పాఠశాలలు, పాపిరెడ్డిగూడ, వేములనర్వ, కేశంపేట, సంతపూర్ గ్రామాల్లోని ఎంపీపీఎస్ పాఠశాలలో సమాఖ్య సభ్యత్వ నమోదును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ఫెడరేషన్‌తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. టీచర్ల సర్దుబాటును ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. బదిలీలతో పాటు పదోన్నతులు కల్పించాలన్నారు. అనంతరం తదితర సమస్యలు పేర్కొంటూ.. మండల విద్యాధికారి చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సమాఖ్య మండల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు వినీత్, కోశాధికారి చిన్నరావు, విజయ్, అరుణ్, రవికుమార్, కేశంపేట క్లస్టర్ ప్రధానోపాధ్యాయురాలు విద్యావతి తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్