
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నందిగామ: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మండల పరిధి చేగూరులో పీఏసీఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్ ఆధ్వర్యంలో సోమవారం పీఏసీఎస్ భవన నిర్మాణ పనులకు ముఖ్య అతిథిలుగా పాల్గొన్న విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.50 లక్షల వ్యయంతో గోదాంలను నిర్మించామని తెలిపారు. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు కావాల్సిన రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం పావలా వడ్డీకే పంట రుణాలు ఇస్తున్నామన్నారు. తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో చెల్లించాలని, కనీసం రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. లేదంటే రూపాయి పావలా వడ్డీ చెల్లించాల్సి వస్తుందనివివరించారు. వీటితో పాటు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందుబాటులో ఉన్నాయని, రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో చైర్మన్ గొర్లపల్లి అశోక్, వైస్ చైర్మన్ పద్మారావు, డైరెక్టర్లు నర్సింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగ నర్సింహ యాదవ్, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, నాయకులు కొమ్ము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, కావలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి