
యువతి(20) కుటుంబం రెండేళ్లుగా కిరాయికి ఉంటున్నారు. ఇంటి ఓనర్ కుమారుడు కార్తీక్(24) యువతితో పరిచయం
రంగారెడ్డి: ప్రేమ, పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పిన యువకుడు ఓ యువతిని తల్లిని చేసి ముఖం చాటేశాడు. ఈ ఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రంలోని హనుమాన్‌నగర్ కాలనీలో మోకిల గ్రామానికి చెందిన బాధిత యువతి(20) కుటుంబం రెండేళ్లుగా కిరాయికి ఉంటున్నారు. ఇంటి ఓనర్ కుమారుడు కార్తీక్(24) యువతితో పరిచయం పెంచుకున్నాడు.
ఏడాది కాలంగా యువతితో ప్రేమలో ఉన్న యువకుడు ఆమెను గర్భవతిని చేశాడు. ఇరు కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయి. కాగా మే 24న యువతి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కార్తీక్ కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవవడంతో బాధితురాలు బుధవారం శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి తెలిపారు.