సిరిసిల్ల: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ గరీమా అగ్రవాల్ జాతీయజెండా ఆవిష్కరించారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ జెండా ఆవిష్కరించారు. విద్యార్థులకు నోట్‌బుక్‌లు అందజేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎస్పీ ఆఫీస్‌లో ఎస్పీ మహేశ్ బి గితే జెండా ఆవిష్కరించారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, జి.వెంకటేశ్వర్లు, ఏవో పద్మ, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్, రవీందర్, మొగిలి, రవి, ఆర్‌ఐలు మధుకర్, సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
బెటాలియన్‌లో..
సిరిసిల్ల అర్బన్: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను సిరిసిల్ల పట్టణంతోపాటు, విలీన గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్థాపూర్‌లో గల 17వ బెటాలియన్‌లో కమాండెంట్ సురేశ్ జెండా ఎగరేశారు. 10వ వార్డు బోనాలలో బొల్గం వైష్ణవి, 8వ వార్డు పెద్దూరులో లింగంపల్లి భాగ్యలక్ష్మి, 9వ వార్డులో దొంతినేని కళ్యాణి, 22వ వార్డులో లింగంపల్లి గంగరాజు, 24వ వార్డులో బుర్ర మల్లికార్జున్, 11వ వార్డులో మామిండ్ల మహేశ్, 12వ వార్డులో నాగరాజు, 1వ వార్డులో బూర బాలు జెండా ఆవిష్కరించారు.
జెండావందనం చేస్తున్న కమాండెంట్, సిబ్బంది
జెండా ఆవిష్కరిస్తున్న ఎస్పీ మహేశ్ బి గితే
తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూలు వేస్తున్న కలెక్టర్ గరీమా అగ్రవాల్


