మార్గం వెతుకు..
సిరిసిల్ల/కరీంనగర్ స్పోర్ట్స్ : బహుళ నైపుణ్యాలు ఎప్పుడైనా పనికొస్తాయి. బంగారు బాటవేస్తాయి. సాధన చేస్తే ఏదైనా సులభమే. అభ్యాసమే ఏదో ఒకనైపుణ్య సాధనకు మందు. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ప్రతిభ.. ఆలోచన.. ఆచరణతో ముందుకెళ్తే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలపై పట్టు పెంచుకుంటే భవిష్యత్ బాగుంటుంది. దూసుకెళ్తున్న ఐటీ.. తోటి వారితో పోటీ.. వీటన్నింటిని నెగ్గుకు రావాలంటే పట్టుదల ముఖ్యం.
ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఇంటర్ పూర్తిచేసిన వారు
భావ వ్యక్తీకరణతో విజయం
విద్యార్హత, మార్కులకు తోడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో భావవ్యక్తీకరణ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. తెలిసిన అంశాన్ని, చేసిన ప్రయోగాన్ని స్పష్టంగా చెప్పగలగడం.. భాష నైపుణ్యంతో వివరించగలగడం.. అవతలి వ్యక్తులను ఆకట్టుకుంటాయి. వీటిని నేర్పడానికి శిక్షణ కేంద్రాలూ ఉంటాయి. వాటిలో చేరి సాధన చేయవచ్చు.
ట్రైనింగ్‌తో ముందుకు..
సమయం విలువను గుర్తిస్తే ఇంజినీరింగ్, మెడిసిన్ దేనిలోనైనా సీటు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్‌లో చేరిన విద్యార్థులు, ఇప్పటికే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైవారు ఆ దిశగా కసరత్తు చేయాలి.
లక్ష్యం.. గుర్తుంచుకోవాలి..
మెహందీ డిజైన్, వంటలతో వ్యాపారం, అల్లికలు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా నేర్చుకోవచ్చు. లక్ష్యంతో నేర్చుకుంటే ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చినా గట్టెక్కవచ్చు. ఈ కోర్సులకు ప్రభుత్వ పరంగా శిక్షణ కేంద్రాలు గురుకులాల్లో, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో పేద విద్యార్థులకు వెసులుబాటు ఉంటుంది. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదివి ర్యాంకుతో సీటు పొందిన వారి స్పూర్తిని అంది పుచ్చుకోవాలి.
సమయం వృథా.. జీవితాంతం వ్యథ
పుస్తకాలతో పనేమీ లేదని ఫోన్లు, టీవీలతో ఎంజాయ్ చేద్దామనుకుంటే మాత్రం భవితను ముంచి వేసుకున్నట్లే. వేళాపాళా లేకుండా కాలక్షేపం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొత్త విద్యాసంవత్సరంలో ఏ కోర్సులో చేరితే భవిష్యత్ బాగుంటుందో ఇంటర్నెట్‌లో పరిశీలించవచ్చు. ప్రణాళికతో ఉండాలి. విద్యాసంబంధ అంశాలు ఉచిత పుస్తకాలు, పాఠాలు అందుబాటులో ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి.
నైపుణ్యాలు పెంచుకునేందుకు పట్టుదల పెంచుకోవాలి. ప్రాధాన్యం ఇవ్వాలి. సమయం దొరికినప్పుడల్లా ఆయా సమావేశాలు, నైపుణ్య కేంద్రాలు, లైబ్రరీలను సందర్శించాలి. అకడమిక్ చదువులే కాకుండా నృత్యం, సంగీతం, చిత్రలేఖనం లాంటివాటిపై పట్టుసాధించాలి.
ఎంఎస్ ఆఫీస్, జావా, పైథాన్, సీప్లస్ వంటి కంప్యూటర్ ఆధారిత కోర్సులు నేటితరానికి ఎంతో ఉపయోగం. వీటిలో రాణిస్తే ఉపాధికి కొదువ ఉండదు. ఎప్పుడు సమయం దొరికినా వాటిపై పట్టుసాధించాలి. భవిష్యత్తుపై భరోసా పెంచుకోవాలి.
నిర్మాణరంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రికల్ పనుల వృత్తికి డిమాండ్ ఉంటోంది. ఇవి నేర్చుకుంటే కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు వైరింగ్, స్విచ్ బోర్డులు, ఎలక్ట్రిక్ ఉపకరణాల బిగింపు పనులు తెలిసిన వారికి చేతినిండా పని, కడుపు నిండా తిండి అన్నట్టుగా సంపాదించుకోవచ్చు
1,968
పరీక్ష రాసినవారు
ఉత్తీర్ణత సాధించిన వారు
3,353
11,961
14,943
2,562
5,796
3,762
4,338
జగిత్యాల
రాజన్న సిరిసిల్ల
కరీంనగర్
పెద్దపల్లి


