ఎస్సైల బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఎస్సైల బదిలీ

May 31 2026 1:18 AM | Updated on May 31 2026 1:18 AM

● ఏడుగురికి స్థాన చలనం జాబ్‌మేళాలో 23 మందికి ఉద్యోగాలు కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర సెక్రటరీగా శ్రీనివాస్‌ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి

● ఏడుగురికి స్థాన చలనం

సిరిసిల్ల: జిల్లాలో ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్‌ బీ గీతే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో వీఆర్‌(డీఎస్‌బీ)లో ఉన్న ఎం.నాగరాజును సిరిసిల్ల టౌన్‌కు, ముస్తాబాద్‌ ఎస్సై సీహెచ్‌.గణేశ్‌ను సిరిసిల్ల టౌన్‌కు బదిలీ చేశారు. సిరిసిల్ల టౌన్‌లో పని చేస్తున్న సీ.హెచ్‌.శ్రీకాంత్‌ను గంభీరావుపేటకు, అక్కడ పనిచేస్తున్న పి.అనిల్‌కుమార్‌ను జిల్లా కేంద్రంలోని సీసీఎస్‌కు బదిలీ చేశారు. జిల్లా కేంద్రంలోని సీసీఎస్‌(డీసీఆర్‌బీ)లో పనిచేస్తున్న జి.జ్యోతిని ముస్తాబాద్‌కు, సీసీఎస్‌లో పనిచేస్తున్న పాక గణేశ్‌ను వేములవాడ టౌన్‌ ఎస్సైగా బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న ఎ.మురళీధర్‌గౌడ్‌ను ఎల్లారెడ్డిపేట పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

సిరిసిల్లటౌన్‌: పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఎంఎన్‌సీ సంస్థ లాలాటాక్ష కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కళాశాలలో డిగ్రీ ఫస్టియర్‌ పూర్తిచేసి రెండో సంవత్సరం చదువుతున్న 23 మందిని యూఎస్‌ ఐటీ బెంచ్‌ సేల్స్‌ రిక్రూటర్‌ పోస్టులకు ఎంపిక చేశారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు కంపెనీ ఆఫర్‌ లెటర్లను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి చేతుల మీదుగా అందజేశారు. ఎంపికై న వారికి వార్షిక వేతన ప్యాకేజీ రూ.1.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

వేములవాడ: కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలని మున్సిపల్‌ యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్‌ కోరారు. మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట సీఐటీయూ 57వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా శనివారం జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరారు. యూనియన్‌ అధ్యక్షుడు సరిపెల్లి నరేశ్‌, నాయకులు కీసర్‌ శ్రీనివాస్‌, కావాలా సత్తయ్య, బొట్టు శీను, పిట్టల శంకర్‌, బొడ్డు శ్రీనివాస్‌, సుంకపాక పరశురాములు, వావిలాల మమత, మనీష, తోట శంకరవ్వ, ఎల్లవ్వ పాల్గొన్నారు.

సిరిసిల్ల: జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్‌ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర సెక్రటరీగా శనివారం నియమితులయ్యారు. ఈమేరకు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నియామకపత్రాన్ని అందించారు. అమరవాది లక్ష్మీనారాయణ నాయకత్వంతో అంకితభావం, సేవా దృక్పథంతో సంస్థను అభివృద్ధి పథంలో కొనసాగిస్తామని శ్రీనివాస్‌ స్పష్టంచేశారు. శ్రీనివాస్‌ను జిల్లా ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ కొత్తపల్లి శ్రీనివాస్‌, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు కటుకం సత్తయ్య అభినందించారు.

సిరిసిల్లటౌన్‌: పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలిన ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం కోరారు. ఈమేరకు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ ఎదుట శనివారం నిరసన చేపట్టి మాట్లాడారు. సంజీవయ్యనగర్‌లో ఒకరు జీ+2 రెసిడెన్షియల్‌ పర్మిషన్‌ తీసుకుని జీ+4 బిల్డింగ్‌ నిర్మించి కమర్షియల్‌గా వినియోగిస్తున్నారని ఆరోపించారు. నిబంధలకు విరుద్ధంగా వెలసిన భవంతులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సలేంద్రి ఎల్లయ్య, గుజ్జ దేవదాస్‌, ప్రసాద్‌, లచ్చన్న, సత్తయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement