వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిలో భక్తులు తమ వంతు సహకారం అందజేస్తున్నారు. హైదరాబాద్ ఎల్‌బీనగర్‌కు చెందిన జొన్నగాని రాజేశ్‌గౌడ్–సరిత దంపతులు ఆలయ అభివృద్ధి నిధికి రూ.లక్ష విరాళం అందజేశారు. అలాగే సిద్దిపేటకు చెందిన భక్తుడు ఆకుల నితేందర్ కుటుంబ సభ్యులు రూ.50 వేలు విరాళంగా అందజేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏఈవో శ్రావణ్, పర్యవేక్షకులు వెంకటప్రసాద్, అకౌంట్ అడ్వయిజర్ ఆగమరావు, జూనియర్ అసిస్టెంట్ మమత ఉన్నారు.


