● విద్యుత్ సేవలకు ‘మీసేవ’ల్లో దరఖాస్తు ● అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ 1912 ● సమస్యలపై ఫిర్యాదుకు వాట్సాప్ నంబర్ 79016 28348 ● ‘సాక్షి’తో ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ బి.భిక్షపతి
సిరిసిల్ల: జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు మీసేవ ద్వారా అన్ని సేవలను అందుబాటులోకి తెచ్చామని, ఏ సేవ పొందాలన్నా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే సరిపోతుందని ఎన్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ) బి.భిక్షపతి తెలిపారు. గ్రామాల్లో ఉండే కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 56 ఏళ్లుగా సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సేవలు అందిస్తున్న ‘సెస్’ సంస్థ లైసెన్స్ రెన్యూవల్ కాకపోవడంతో ఎన్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సేవలను అందిస్తోందని వివరించారు. ఎన్పీడీసీఎల్‌లో అమలవుతున్న అన్ని ఆధునిక విధానాలు రాజన్నసిరిసిల్ల జిల్లా సర్కిల్‌లో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సిరిసిల్ల సర్కిల్‌లో కొత్తగా అమలవుతున్న విద్యుత్ విధానాలపై ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..


