నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

Apr 6 2026 8:24 AM | Updated on Apr 6 2026 8:24 AM

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం ● ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

● ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

వేములవాడ: నాణ్యమైన విద్యుత్‌ సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ పట్టణ శివారు చెక్కపల్లిరోడ్డులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లను ఆదివారం తనిఖీ చేశారు. వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ గత ఐదు రోజుల్లోనే జిల్లాలో 250 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గతంలో సెస్‌ ద్వారా 1400 కనెక్షన్లు మాత్రమే ఇవ్వగా మరో 2500 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సిరిసిల్ల మగ్గాల కార్మికుల విద్యుత్‌ బిల్లుల సమస్య పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కేటగిరీ–3 కింద బిల్లింగ్‌ అవుతున్న వాటిని 4ఏ కిందకు మారుస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంత రైతుల సమస్యలను పరిష్కరించేందుకు శ్రీపొలంబాట్ఙ నిర్వహిస్తున్నామన్నారు. అగ్రహారం ఫీడర్‌లో ఫాల్ట్‌ పాసింగ్‌ ఇండికేటర్లను సీఎండీ పరిశీలించారు. వేములవాడ సబ్‌డివిజన్‌ కార్యాలయాన్ని సందర్శించి వినియోగదారులకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పేపర్‌లెస్‌ లావాదేవీల కోసం సిరిసిల్ల సర్కిల్‌లో సాప్‌(ఎస్‌ఏపీ) అప్లికేషన్‌ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement