లింగంకుంటలోకి వస్తున్న గోదావరి జలాలతో దాహం తీర్చుకుంటున్న
మూగజీవాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): మండుతున్న ఎండలతో మనుషులే ఇబ్బంది పడుతుండగా.. ఊరికి దూరంగా ఉండే మూగజీవాల సంగతి సరేసరి. తడారుతున్న గొంతులకు ఇప్పుడు గోదావరి జలాలు వరంగా మారాయి. ముస్తాబాద్ మండలం లింగంకుంట, పెద్దచెరువుల్లోకి మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వస్తున్నాయి. దీంతో ఇటు పంట పొలాలకే కాకుండా మూగజీవాల దాహార్తిని తీర్చుతున్నాయి.


