విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్ సిరిసిల్ల: విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. 13 కేజీబీవీలు, ఏడు టీజీఎంఎస్ హాస్టళ్లకు కలిపి 20 ఫ్రీజర్లు సోమవారం సమకూర్చారు. చలికాలంలో విద్యార్థులకు వేడి నీళ్లు అందించేందుకు ఇప్పటికే గీజర్లు అందించామని గుర్తు చేశారు. ఆహార పదార్థాలు, కూరగాయలు ఫ్రీజర్లలో నిల్వ చేసుకోవచ్చన్నారు. డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, జీసీడీవో పద్మజ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్న హౌసింగ్, ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు. త్వరలో మెగా హౌసింగ్ గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని వివరించారు.
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్ 2న గ్రామసభలు, మున్సిపాలిటీల్లో వార్డుసభల నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. మండలంలోని దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(ఈఎంఆర్‌ఎస్)ను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి పరీక్షల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు.
● కలెక్టర్ గరీమా అగ్రవాల్
అధికారులకు అభినందన
2న గ్రామ, వార్డుసభలు
గృహ సముదాయాల బ్లాక్‌లను పోర్టల్‌లో నమోదు చేయాలి
జనగణనకు సంబంధించి గృహ సముదాయాల బ్లాక్‌లు గుర్తించి సీఎంఎంఎస్(సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) పోర్టల్‌లో నమోదు చేయాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతీ హోలికేరి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మే 11 నుంచి ప్రారంభం కానున్న జనగణన కోసం ప్రతీ హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లో 700 నుంచి 850 వరకు జనాభా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి