వీర్నపల్లిలో పట్టపగలే చోరీ | - | Sakshi
Sakshi News home page

వీర్నపల్లిలో పట్టపగలే చోరీ

Mar 31 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:38 AM

వీర్నపల్లిలో పట్టపగలే చోరీ వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండల కేంద్రంలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితుడు తెలిపిన వివరాలు. మండల కేంద్రంలోని వడ్లూరి రాజం ఇంట్లోకి సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. బీరువాలో భద్రపరిచిన రూ.2లక్షలు, రెండు బంగారు పుస్తెలు, వెండి గొలుసులు, ఆరు తులాల బంగారు ఆభరణాలతోపాటు ఇతర విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుడు రాజం ఫిర్యాదుతో ఎస్సై వేముల లక్ష్మణ్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

రెండు సబ్‌స్టేషన్ల మంజూరు

సిరిసిల్ల: జిల్లాలో పెరుగుతున్న విద్యుత్‌ లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు సబ్‌స్టేషన్లకు సాంకేతిక అనుమతులను ఎన్‌పీడీసీఎల్‌ జారీ చేసిందని కరీంనగర్‌ ఎస్‌ఈ ఆర్‌.రవీందర్‌ సోమవారం తెలిపారు. వీర్నపల్లి మండలం మద్దిమల్ల, తంగళ్లపల్లి మండలం రామన్నపల్లిలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు అనుమతులు మంజూరైనట్లు ప్రకటించారు. ఈ రెండు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి సుమారు రూ.7.09 కోట్లు వ్యయమవుతుందని వివరించారు.

రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు

వీర్నపల్లి: మండలంలో సోమవారం రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని బంజేరుకు చెందిన బట్టు వెంకటేశ్‌ బైక్‌పై వీర్నపల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఎదురుగా అదే గ్రామానికి చెందిన మాలోత్‌ హరిదాస్‌ వస్తున్నాడు. ఈ క్రమంలోనే రెండు బైక్‌లు ఢీకొట్టుకున్నాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement