నిర్మించారు.. వదిలేశారు! | - | Sakshi
Sakshi News home page

నిర్మించారు.. వదిలేశారు!

Mar 30 2026 7:29 AM | Updated on Mar 30 2026 7:29 AM

నిర్మించారు.. వదిలేశారు!

సిరిసిల్ల అర్బన్‌: నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం సిరిసిల్ల పట్టణ పరిధి లోని శాంతినగర్‌, పెద్దూరు, రగుడు గ్రామాల్లో డ బుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసింది. పూర్తయిన ఇళ్లు పేదలకు కేటాయించేందుకు ము న్సిపల్‌ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. సిరిసిల్ల పట్టణంలో 39 వార్డుల వ్యాప్తంగా 7,363 దరఖాస్తులు వచ్చాయి. వాటిపై రెవెన్యూ, మున్సి పల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు చేశారు. లబ్ధిదారులను సైతం ఎంపిక చేశారు. వచ్చిన దరఖాస్తులలో 4,161 మందిని అనర్హులుగా గుర్తించా రు. అర్హులైన 3,202 దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు. డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. పట్టణ పరిధిలోని పెద్దూరు, రగుడు గ్రామాల్లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించగా.. శాంతినగర్‌లో ని ర్మించిన 204 ఇండ్ల కేటాయింపు విషయంలో అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు.

లబ్ధిదారుల ఎదురుచూపులు

‘డబుల్‌’ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు అధికారులు సర్వేలు చేశారు. వార్డు సభలు నిర్వహించి లబ్ధిదా రులను ఎంపిక చేశారు. రగుడు వద్ద 72, పెద్దూరులో 516 డబుల్‌ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశా రు. శాంతినగర్‌లో 204 ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీలో పిచ్చిమొక్కలు మొలి చాయి. కొన్ని ఇళ్ల కిటికి అద్దాలు ధ్వంసమయ్యా యి. కొన్ని భవనాలు చిన్నపాటి వానలకు ఉరుస్తున్నాయి. జనసంచారం లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి.

శాంతినగర్‌ ‘డబుల్‌’ కాలనీలో పెరిగిన పిచ్చిమొక్కలు పగిలిపోయిన కిటికి అద్దం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement