ఉద్యమకారుల అరెస్ట్‌ అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారుల అరెస్ట్‌ అప్రజాస్వామికం

Mar 30 2026 7:29 AM | Updated on Mar 30 2026 7:29 AM

ఉద్యమకారుల అరెస్ట్‌ అప్రజాస్వామికం ● తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌

● తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌

సిరిసిల్లటౌన్‌: తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పలువురు ఖండించారు. సిరిసిల్లలో ఆదివారం అరెస్టయిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేతలు ఠాణాలో నిరసన తెలిపారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సోమవారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు 250, గజాల భూమి రూ.25 వేల పెన్షన్‌. సంక్షేమబోర్డు, గుర్తింపుకాార్డు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. అరెస్టు అయిన వారిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మామిడాల రమణ, కొండ శంకర్‌, బింగి ఇజ్జగిరి, కొక్కుల ఆంజనేయులు, గుజ్జే దత్తాద్రి, చిలుక శారద పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement