సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 30 2026 7:29 AM | Updated on Mar 30 2026 7:29 AM

సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026 సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేయాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ● డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ వెంటనే పంపిణీ చేయాలి

నాలుగేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు

శాంతినగర్‌లో 204 ఇళ్లు సిద్ధం

శిథిలావస్థకు చేరుతున్న ‘డబుల్‌’ ఇళ్లు

చందుర్తి(వేములవాడ): కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన చందుర్తి, రుద్రంగి మండలాల బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరానికి హాజరై మాట్లాడారు. మండల స్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు క్రమబద్ధమైన వ్యవస్థను నిర్మించి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మండల శాఖ అధ్యక్షులు మోకిలే విజేందర్‌, కర్ణవత్తుల వేణు, రాష్ట్ర నాయకులు అల్లాడి రమేశ్‌, ఎర్రం మహేశ్‌, లింగంపల్లి శంకర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్‌, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు కౌడిపల్లి గోపాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేశ్‌ పాల్గొన్నారు.

సిరిసిల్ల అర్బన్‌: ప్రజాప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ కోరారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 8, 9వ వార్డుల నుంచి పలువురు యువకులు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, బడుగు భరత్‌, నాగరాజు, రజనీకాంత్‌ పాల్గొన్నారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి నాలుగేళ్లు అవుతుంది. శాంతినగర్‌లో ఇళ్ల పంపిణీ కోసం 106 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇండ్లను పంపిణీ చేయలేదు. దీంతో ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇప్పటికై నా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలి. – మూషం రమేశ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement