బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రమాకాంత్‌రావు | - | Sakshi
Sakshi News home page

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రమాకాంత్‌రావు

Mar 31 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:38 AM

సిరిసిల్లటౌన్‌: సిరిసిల్లలో బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు సోమవారం హోరాహోరీగా సాగాయి. అధ్యక్షుడిగా ఆవునూరి రమకాంతరావు ఎన్నికయ్యారు. బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. 226 మంది న్యాయవాదులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా రమకాంతరావు, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్‌.వెంకటయ్య, కోశాధికారిగా ఎస్‌.దేవరాజు ఎన్నికై నట్లు ఎన్నికల అఽధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా గోవర్ధన్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీగా జి.కిషన్‌, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెక్రటరీలుగా కె.శ్రీనివాస్‌, బి.కళ్యాణి, లైబ్రరీ సెక్రటరీగా ఎం.పుష్పలత, మహిళా రిప్రజంటేటీవ్‌గా వై.జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి జగ్గారావు తెలిపారు. నూతన పాలకవర్గం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement