● ఫ్రీ వీసా.. ఫ్రీ విమాన టికెట్లు ● 2, 3 తేదీల్లో వేములవాడలో ఇంటర్వ్యూలు ● మహమ్మద్ రఫీ, ఎండీ, ఏఆర్‌ఆర్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ
సిరిసిల్ల: దుబాయ్‌లోని పలు కంపెనీలు ఉచిత వీసా, విమాన టిక్కెట్లు సమకూర్చుతూ ఉపాధి కల్పించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ విషయాన్ని వేములవాడకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఆమోదిత ఏఆర్‌ఆర్(మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ రఫీ సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. దుబాయ్ వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న యువకులకు ఉచితంగా వీసా, విమాన టిక్కెట్ పొందే అవకాశం ఉందన్నారు.
2, 3న ఇంటర్వ్యూలు
దుబాయ్(యూఏఈ)లోని క్యాటరింగ్ కంపెనీలో పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు వేములవాడలోని ఏఆర్‌ఆర్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ ఆఫీస్‌లో ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. భోజన వసతి కల్పించి నెలకు 950 దుబాయ్ దిరమ్స్(రూ.25వేలు) జీతం ఉంటుందని తెలిపారు. ఉచిత నివాసం, రవాణా, రోజుకు 9 గంటలు పని ఉంటుందని తెలిపారు. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు, ఈసీఎన్‌ఆర్ పాస్‌పోర్టు ఉన్న వారు మాత్రమే అర్హులని వివరించారు. ఆసక్తి గల వారు 95505 60910/95506 20505/83411 65239, 96666 22890/ 70754 62519 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


