సిరిసిల్ల: మహనీయులు బాబు జగ్జీవన్‌రామ్, బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల్లో జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ విగ్రహాల వద్ద రోజూ పారిశుధ్య పనులు చేయించాలని సూచించారు. ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వేడుకలకు ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలన్నారు. సెస్ అధికారులు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని, వైద్యులు, సిబ్బందితో శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం వివిధ సంఘాల ప్రతినిధులు పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏఎస్పీ చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రవీందర్‌రెడ్డి, ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, డీఎంహెచ్‌వో రజిత, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఉద్యానవన అధికారి శరత్‌బాబు, ‘సెస్’ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్, దళిత సంఘాల నాయకులు కత్తెర దేవదాస్, ఆకునూరి బాలరాజు, రాగుల రాములు, నాలుక సత్యం, బూర యాదగిరి, మేకల కమలాకర్, బాలయ్య, బొడ్డు నారాయణ, లింగంపల్లి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
బోయినపల్లి: టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని కొదురుపాక పీహెచ్‌సీలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీబీ బాధితులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.వెయ్యి ఆర్థికసాయం అందిస్తుందని, వ్యాధి సోకినవారు మందులు వాడుతూ, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. జిల్లాలో టీబీ రహిత గ్రామాల కోసం కృషి చేసిన 20 మంది పంచాయతీ కార్యదర్శులు, ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, సిబ్బందిని సన్మానించారు. డీఎంహెచ్‌వో రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ అనిత, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబు, వైద్యులు శంకర్, సత్యనారాయణ, ఆనంద్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ రేణుప్రియాంక, రాజుకుమార్, తహసీల్దార్ నారాయణరెడ్డి, సర్పంచ్ మంజుల, ఎంపీవో శ్రీధర్, సూపర్‌వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


