ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో మంగళవారం గౌడకులస్తుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ–జమదగ్నిల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఎదుర్కోలు కార్యక్రమం అనంతరం బైండ్ల పూజారులు నాగవెళ్లి పట్నం వేసి కల్యాణం జరిపించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్‌గౌడ్, రెడ్డిసంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాబేరబేగం, సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల)


