ముస్తాబాద్(సిరిసిల్ల): కొండాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శనివారం పోచమ్మ బోనాలు తీశారు. కులస్తులు ప్రతీ ఇంటి నుంచి బోనాలతో తరలివచ్చారు. బైండ్ల కళా కారుల ఆటలు, డప్పుచప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాలతో పోచమ్మ బోనాలు ఆలయానికి తీసుకెళ్లి మొక్కులు చెల్లించారు. ఏటా ఉగాది తర్వాత పోచమ్మ బోనాలు తీయడం ఈ గ్రామంలో ఆనవాయితీ. సర్పంచ్ మహేందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అధ్యక్షుడు చిగురు నరేశ్, రెడ్డి సంఘం అధ్యక్షుడు తీనేటి రమేశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, కోశాధికారి గుడికందుల మహేందర్‌రెడ్డి, సాయిరెడ్డి, వెంకట్‌రెడ్డి, దేవిరెడ్డి, అంజిరెడ్డి, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


