ఉపసర్పంచ్ పదవికి వేలం
● ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత
● రంగంలోకి దిగిన పోలీసులు
ధర్మపురి: ధర్మపురి మండలం కమలాపూర్‌లో బుధవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా కుమ్మరి తిరుపతి గెలుపొందారు. ఉపసర్పంచ్ పోటీలో ఉన్న కొందరు తనకంటే తనకు అంటూ రసాభాస చేశారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడిచి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఉపసర్పంచ్ పదవికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తామంటూ వేలానికి దిగారు. విషయం తెలిసిన వెంటనే సీఐ రాంనర్సింహరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు చేరుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇరువర్గాలకు నచ్చజెప్పారు.
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ కార్మికుడికి గాయాలు
జూలపల్లి (పెద్దపల్లి):
అబ్బాపూర్ గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బొమ్మెనవేని చంద్రయ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పనినిమిత్తం అబ్బాపూర్ నుంచి జూలపల్లికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో స్థానిక కొచ్చెరువుకు సమీపంలో ఆటోను తప్పించబోయి అదుపుతప్పి పడిపోయాడు. ఈఘటనలో కాలితీవ్రగాయమైంది. స్థానికుల సమాచారంతో 108 వాహనం సిబ్బంది ఆరె సతీశ్, ఈఎంటీ, పైలెట్ శ్రీనివాస్ వెంటనే ఘటనా స్థలానికి చేరకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


