ప్రజలకు అందుబాటులో ఉండండి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు అందుబాటులో ఉండండి

Dec 18 2025 7:27 AM | Updated on Dec 18 2025 7:27 AM

ప్రజల

ప్రజలకు అందుబాటులో ఉండండి

ప్రజలకు అందుబాటులో ఉండండి ● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కార్మికుల హక్కుల సాధనకు పోరాటం ● రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బాలరాజు కాంగ్రెస్‌లో చేరికలు ‘ఉప్పరులను పాత జాబితాలోనే కొనసాగించాలి’

● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ఇల్లంతకుంట(మానకొండూర్‌): సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాల నూతన సర్పంచులు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాభివృద్ధికి పాటుపడాలని నూతన సర్పంచులకు సూచించారు. సిరికొండ సర్పంచ్‌ గొడుగు విఠల్‌, అనంతారం సర్పంచ్‌ వొల్లాల వెంకటేశం, తాళ్లల్లపల్లి సర్పంచ్‌ మీసాల కనకరాజు, రామాజీపేట సర్పంచ్‌ చొప్పరి భూమయ్య, ఇల్లంతకుంట సర్పంచ్‌ మామిడి రాజు ఎమ్మెల్యేను కలిశారు. పార్టీ మండల అధ్యక్షుడు, ముస్కానిపేట సర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: హమాలీ కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలు చేస్తామని రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సంటి బాలరాజు పేర్కొన్నారు. సిరిసిల్లలో బుధవారం నిర్వహించిన కార్మికసంఘం ప్రథమ మహాసభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాయకులు మంద సుదర్శన్‌, కిష్టాపురం లక్ష్మణ్‌, బచ్చుపల్లి శంకర్‌, అజ్జ వేణు, కడారి రాములు పాల్గొన్నారు.

నూతన కమిటీ

జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. ముఖ్య సలహాదారుగా అజ్జ వేణు, గౌరవ అధ్యక్షుడిగా కడారి రాములు, గంగాపురం పోచమల్లు, అధ్యక్షుడిగా పుప్పాల రాజేశ్‌, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల దుర్గయ్య, కోశాధికారి, సహాయ కార్యదర్శిగా వేల్పుల కనకరాజు, రాగుల ఎల్లయ్య, ఉపాధ్యక్షుడిగా బోగి వెంకటేశం, కౌన్సిల్‌ సభ్యులుగా అనుముల లచ్చయ్య, బియ్య పెద్దసాయిలు, కొమ్మటి కిరణ్‌, రాగుల దుర్గయ్య, నక్క రాములు, బత్తుల మల్లయ్య, జంపల్లి వెంకటేశం, బొల్లి దేవయ్య, తోట మారుతిని ఎన్నుకున్నారు.

సిరిసిల్లటౌన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనకు ఆకర్షితులై యువత పార్టీలో చేరుతున్నారని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన యువకులు పార్టీలో చేరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, బ్లాక్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ జిల్లా సభ్యులు సంగీతం శ్రీనాథ్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిమల్ల భాను, యూత్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్‌, యూత్‌ కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు పోగుల దేవరాజు, పట్టణ యూత్‌ మాజీ అధ్యక్షుడు చిందం శ్రీనివాస్‌, యువజన కాంగ్రెస్‌ అసెంబ్లీ సెక్రటరీ ఆకేని సతీశ్‌, నాయకులు కలిం, ఆడెపు ప్రసాద్‌, కళ్యాణ్‌ పాల్గొన్నారు.

కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిమ్మపల్లికి చెందిన ఉప్పర కులస్తులను పాతజాబితా బీసీ(డీ)లోనే కొనసాగించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన మాల, మాది గ సంఘాలు ఇన్‌చార్జి కలెక్టర్‌, ఆర్డీవో, డీపీవోలకు బుధవారం ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ నిమ్మపల్లి సర్పంచ్‌ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వేషన్‌ కేటాయించినట్లు పేర్కొన్నారు. గ్రామంలోని ఉప్పర కులానికి చెందిన మహిళ, ఒకటోవార్డు ఎస్సీకి కేటాయించగా రాఘవేందర్‌ అనే వ్యక్తి ఎస్సీ సర్టిఫికెట్‌పై పోటీ చేశారని తెలిపారు. అధికారులను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో దప్పుల నరేశ్‌, సదానందం, దప్పుల స్వామి, మధుకర్‌, అనిల్‌, శ్రీకాంత్‌, మల్యాల నరేశ్‌, ప్రసాద్‌, మనోజ్‌కుమార్‌, శ్రీనివాస్‌ కోరారు.

ప్రజలకు అందుబాటులో  ఉండండి 
1
1/2

ప్రజలకు అందుబాటులో ఉండండి

ప్రజలకు అందుబాటులో  ఉండండి 
2
2/2

ప్రజలకు అందుబాటులో ఉండండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement