పటిష్ట భద్రత మధ్య ఎన్నికలు
● ఎస్పీ మహేశ్ బీ గీతే
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, రాచర్లగొల్లపల్లి, రాచర్లబొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లిలోని పోలింగ్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. మూడో విడతలో 730 మంది పోలీస్ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఐలు శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు వేముల లక్ష్మణ్, ఎల్లయ్యగౌడ్ ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలు పరిశీలన
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ బుధవారం పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, అల్మాస్‌పూర్, రాచర్లగొల్లపల్లి, వీర్నపల్లి మండలం కంచర్ల, వీర్నపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని అదనపు కలెక్టర్ పరిశీలించారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ మూడోవిడత పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా పూర్తయినట్లు తెలిపారు. తహసీల్దార్‌లు సుజాత, ముక్తార్‌పాషా, ఎంపీడీవోలు సత్తయ్య, శ్రీలేఖ ఉన్నారు.
సిట్టింగ్ సర్పంచ్‌ల పరాజయం
ముస్తాబాద్(సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికలలో సిట్టింగ్ సర్పంచ్‌లు ఓటమి చవిచూశారు. తాజా, మాజీ సర్పంచ్‌లు ఈ ఎన్నికలలో రిజర్వేషన్లు అనుకూలించి బరిలో నిలిచారు. మొర్రాపూర్ భూక్య దేవేందర్, తుర్కపల్లి కాశోల్ల పద్మ, గూడూరు చాకలి రమేశ్‌లు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేశారు. వీరి సమీప ప్రత్యర్థుల చేతిలో ఓటమి చెందడంతో నిరాశకు గురయ్యారు. మొర్రాపూర్‌లో దేవేందర్‌పై భూక్య రాజు గెలుపొందగా, తుర్కపల్లిలో కాశోల్ల పద్మపై రొడ్డ భాగ్య, గూడూరులో రమేశ్‌పై చీటి సునీత విజయం సాధించారు.
ఓట్లు అన్ని ఒక్కరికే..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల)్ల: ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్‌తండాలోని ఏడోవార్డులో ధరావత్ సురేష్‌నాయక్ వార్డు సభ్యుడిగా పోటీచేయగా మొత్తం 35 ఓట్లు అతనికే పడ్డాయి. ప్రత్యర్థికి ఒక్క ఓటు రాలేదు. సురేష్‌నాయక్ భార్య సైతం 8వ వార్డులో విజయం సాధించారు.
ఒక్క ఓటూ రాలే..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలో రెండో విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డు సభ్యుడికి ఒక్క ఓటు కూడా రాలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో 3వ వార్డులో పోటీచేసిన పెద్దమ్మల నర్సయ్యకు సున్నా ఓట్లు వచ్చాయి. 10వ వార్డులో బర్ల యెష్పాల్‌కు 3, నేరెళ్ల 8వ వార్డులో దరిపెల్లి శ్రీకాంత్‌కు 2, పద్మనగర్ 1వ వార్డులో మద్దవేని లింబాద్రికి 3, సారంపల్లి 8వ వార్డులో పాలకుర్తి రాములుకు 2, తంగళ్లపల్లిలో 3వ వార్డులో బొల్లారం చంద్రమౌళికి 2 ఓట్లు చొప్పున వచ్చాయి.
పటిష్ట భద్రత మధ్య ఎన్నికలు


