పల్లెల్లో గులాబీ జోష్‌ | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో గులాబీ జోష్‌

Dec 18 2025 7:27 AM | Updated on Dec 18 2025 7:27 AM

పల్లె

పల్లెల్లో గులాబీ జోష్‌

వీర్నపల్లి 205 ముస్తాబాద్‌ 396 ఎల్లారెడ్డిపేట 432 గంభీరావుపేట 2,483

మండలాల వారీగా పార్టీ మద్దతుదారులు సాధించిన సీట్లు

నాలుగు మండలాల్లో ‘తారక’మంత్రం

మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారుల విజయం

ప్రతిపక్షంలోనూ పల్లెల్లో పట్టు సాధించారు

తుది విడత పోలింగ్‌ 79.16

బీఆర్‌ఎస్‌కు 41, కాంగ్రెస్‌కు 17, బీజేపీకి 9, స్వతంత్రులు 20

ముగిసిన సం‘గ్రామం’

పోలింగ్‌ శాతం ఇలా..

సిరిసిల్ల: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు మెజార్టీ స్థానాలు సా ధించారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, వీర్నపల్లి మండలాల్లో 87 గ్రామాలు ఉండగా ఏడు ఏకగ్రీవమయ్యాయి. 80 సర్పంచ్‌ స్థానాలకు, 551 వార్డు సభ్యుల స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. రాత్రి వరకు కొనసాగిన ఎన్నికల ఫలితాల్లో గులాబీ జోష్‌ కనిపించింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ప్రాతినిథ్యం వహిస్తున్న నాలుగు మండలాల్లో ఆయన పట్టు మరోసారి రుజువైంది. మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానంలో ఉండగా.. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. స్వతంత్రులు సైతం తమ సత్తాచాటుకున్నారు. చివరి విడత ఎన్నికలు బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అధికార కాంగ్రెస్‌ కంటే బీఆర్‌ఎస్‌కు సీట్లు ఎక్కువ వచ్చాయి. మూడో విడతగా ఎన్నికలు జరిగిన నాలుగు మండలాల్లో 1,25,324 మంది ఓటర్లు ఉండగా.. 99,202 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాలుగు మండలాల్లో 79.16 పోలింగ్‌ శాతం నమోదైంది.

మండలాల వారీగా ఓటింగ్‌ పర్వం

● వీర్నపల్లి మండలంలోని 17 గ్రామాలకు ఒక్క గ్రామం ఏకగ్రీవమైంది. 16 గ్రామాల్లో 73 మంది అభ్యర్థులు సర్పంచ్‌ స్థానాలకు పోటీపడ్డారు. 59 వార్డులకు 137 మంది పోటీలో ఉన్నారు. మండలంలో మొత్తం ఓట్లు 11,066 ఉండగా.. 9,065 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీర్నపల్లి మండలంలో 81.92 శాతం పోలింగ్‌ నమోదైంది.

● ముస్తాబాద్‌ మండలంలో 22 గ్రామాలకు ఒక్క గ్రామం ఏకగ్రీవమైంది. 21 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. 95 అభ్యర్థులు సర్పంచ్‌ స్థానాలకు, 152 వార్డు సభ్యుల స్థానాలకు 494 మంది పోటీపడ్డారు. మండలంలో మొత్తం ఓట్లు 37,711 ఉండగా.. 30,434 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముస్తాబాద్‌ మండలంలో 80.70 శాతం పోలింగ్‌ నమోదైంది.

● గంభీరావుపేట మండలంలో 22 గ్రామాలకు మూడు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 19 గ్రామాల్లో ఎన్నికలు జరగ్గా 92 మంది అభ్యర్థులు సర్పంచ్‌ పదవికి, 165 వార్డు సభ్యుల స్థానాలకు 491 మంది పోటీపడ్డారు. మండలంలో మొత్తం ఓట్లు 36,135 ఉండగా.. 28,816 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గంభీరావుపేట మండలంలో 79.75 శాతం పోలింగ్‌ నమోదైంది.

● ఎల్లారెడ్డిపేట మండలంలో 26 గ్రామాలకు రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 24 గ్రామాల్లో సర్పంచ్‌ స్థానానికి 120 మంది, 175 వార్డులకు 517 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మండలంలో మొత్తం ఓట్లు 40,412 ఉండగా.. 30,868 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డిపేటలో 76.38 శాతం పోలింగ్‌ నమోదైంది.

వెనకబడిన మూడో విడత

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది. మొదటి విడత వేములవాడ, వేములవాడరూరల్‌, చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో ఎన్నికలు జరగ్గా.. 79.57 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడత ఎన్నికలు బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో జరగ్గా అత్యధికంగా 84.42 శాతం పోలింగ్‌ నమోదైంది. మూడో విడత బుధవారం నాలుగు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 79.16 శాతం నమోదైంది.

పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి

గ్రామపంచాయతీ ఎన్నికల తీరును జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముస్తాబాద్‌తోపాటు నామాపూర్‌, గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యాలయం, లింగన్నపేట, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్‌డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్‌బేగం, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్‌, పరిశ్రమలశాఖ మేనేజర్‌ హనుమంతు, తహసీల్దార్లు రాంచందర్‌, మారుతిరెడ్డి, సుజాత, ఎంపీడీవోలు లచ్చాలు, శ్రీధర్‌ పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపు పరిశీలన

వీర్నపల్లి, ముస్తాబాద్‌ మండలాల్లో ఓట్ల లెక్కింపును ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ పరిశీలించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, మండల ప్రత్యేక అధికారులు క్రాంతికుమార్‌, ఎంపీడీవోలు లక్ష్మీనారాయణ, శ్రీలేఖ, నటరాజ్‌ పాల్గొన్నారు.

మల్లారపు జ్యోత్స్న

మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి

ఎలగందుల నర్సింలు

మల్లుగారి పద్మ

మండలం జీపీలు బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ బీజేపీ ఇతరులు

వీర్నపల్లి 17 06 05 01 05

ఎల్లారెడ్డిపేట 26 11 08 03 04

ముస్తాబాద్‌ 22 13 03 02 04

గంభీరావుపేట 22 11 01 03 07

మేజర్‌ మెజారిటీ

మండలం ఓట్లు 9 గంటలు 11 గంటలు 1 గంట తుది పోలింగ్‌

గంభీరావుపేట 36,135 19.05 48.84 73.08

ముస్తాబాద్‌ 37,711 19.30 41.57 78.37 80.70

వీర్నపల్లి 11,066 20.0 56.17 81.89 81.93

ఎల్లారెడ్డిపేట 40,412 17.17 47.30 76.0 76.38

మొత్తం 1,25,324 18.60 49.80 76.39 79.16

పల్లెల్లో గులాబీ జోష్‌1
1/6

పల్లెల్లో గులాబీ జోష్‌

పల్లెల్లో గులాబీ జోష్‌2
2/6

పల్లెల్లో గులాబీ జోష్‌

పల్లెల్లో గులాబీ జోష్‌3
3/6

పల్లెల్లో గులాబీ జోష్‌

పల్లెల్లో గులాబీ జోష్‌4
4/6

పల్లెల్లో గులాబీ జోష్‌

పల్లెల్లో గులాబీ జోష్‌5
5/6

పల్లెల్లో గులాబీ జోష్‌

పల్లెల్లో గులాబీ జోష్‌6
6/6

పల్లెల్లో గులాబీ జోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement