ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● పోలింగ్ కేంద్రాలు పరిశీలన
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, గంభీరావుపేట మండలం లింగన్నపేట, కేజీ టు పీజీ విద్యాసంస్థ, ముస్తాబాద్ మండల కేంద్రంతోపాటు నామాపూర్ పోలింగ్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖితరెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్డీవో శేషాద్రి, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, హనుమంతు, అఫ్జల్‌బేగం, తహసీల్దార్‌లు సుజాత, మారుతిరెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో సుధాకర్ పాల్గొన్నారు.
వీర్నపల్లి: వీర్నపల్లిలోని జెడ్పీ హైస్కూల్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఎన్నికల సరళిని పరిశీలించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, మండల ప్రత్యేక అధికారులు రాఘవేందర్, క్రాంతికుమార్, ఎంపీడీవో శ్రీలేఖ పాల్గొన్నారు.


