సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ సత్తా
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయన గోపి
సిరిసిల్లటౌన్: జిల్లాలో జరిగిన సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల సత్తాచాటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయన గోపి అన్నారు. ఓటర్లు ఇచ్చిన ఈ తీర్పు అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెంపపెట్టుగా పేర్కొన్నారు. ఆ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజలు బీజేపీని ఆశీర్వదించడంపై కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని వెంకటాపూర్, పదిర, పోతిరెడ్డిపల్లి, జైసేవాలాల్‌తండా, కిష్టునాయక్‌తండా, పొన్నాలపల్లె, నాగంపేట, ముస్తాఫానగర్, ఆవునూరు, ముర్రాయిపల్లి, శాంతినగర్, అంకిరెడ్డిపల్లి, చింతల్‌ఠాణా, అంకుసాపూర్, దేశాయ్‌పల్లె గ్రామాల్లో తమ పార్టీ అఽభ్యర్థులు గెలుపొందారని పేర్కొంటూ వారికి అభినందనలు ప్రకటించారు.
గెలిచిన సర్పంచ్‌ల సంబరాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్, అగ్రహారం, రాజన్నపేట సర్పంచులుగా గెలుపొందిన మేడిశెట్టి కిషన్, మేడిశెట్టి పద్మ, కల్లూరి బాపిరెడ్డి బుధవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. ఈ ముగ్గురు సర్పంచులు భారీ మెజార్టీతో గెలవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద వారి మద్దతుదారులు గజమాలలు, శాలువాలతో సన్మానించారు.


