శాంతియుత వాతావరణంలో ఓటేయ్యాలి
ఎల్లారెడ్డిపేట( సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు. మంగళవారం రాత్రి ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పోలింగ్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


