● అత్యధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్‌వే ● డీసీసీ అధ్యక
ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి
ముస్తాబాద్(సిరిసిల్ల): సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీ తం శ్రీనివాస్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా నియామకమై తొలిసారి ముస్తాబాద్‌కు వచ్చిన శ్రీని వాస్‌కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికా యి. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తొలి రెండు దశల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకుందన్నారు. మూడోదశలోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఉచిత బస్సు, ఉచిత కరెంట్, సన్నబియ్యం, రేషన్‌కార్డుల మంజూరుతో కాంగ్రెస్ పేదల ప్రభుత్వంగా ప్రజల గుండెల్లో నిలిచిందన్నారు. అనంతరం ముస్తాబాద్, పోతుగల్ గ్రామాల్లోని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు ఎల్ల బాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కో–కన్వీనర్ కనమేని చక్రధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ అన్నం రాజేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు గజ్జెల రాజు, దీటి నర్సింలు, పెద్దిగారి శ్రీను, తిరుపతి, గుండెల్లి శ్రీనివాస్, రాజేశం, ఎల్లాగౌడ్, మట్ట రాణి ఉన్నారు.


