కాంగ్రెస్‌లో పలువురి చేరిక
వేములవాడ/చందుర్తి/వేములవాడరూరల్: చందుర్తి మండలం అనంతపల్లి సర్పంచ్‌గా గెలుపొందిన చిలుక బాబుతోపాటు పలువురు వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతపల్లి సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి చిలుక బాబు గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులు ఐతం లహరి, కంబాల లక్ష్మి, బీఆర్‌ఎస్ నాయకులు ఐతం శంకరయ్యలు పార్టీలో చేరారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు చందనం శ్రీనివాస్, వార్డు సభ్యులుగా ఎన్నికైన నేరెళ్ల సరిత, గిరి ప్రసాద్, హరిదాసు, శ్రీనివాస్‌లతోపాటు సుమారు 50 మంది కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయన్నారు. వీరికి విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


