కోడ్ ముగిసే వరకు ర్యాలీలు నిషేధం
● ఎస్పీ మహేశ్ బీ గీతే
ఇల్లంతకుంట(మానకొండూర్): జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూర్, ఇల్లంతకుంట పోలింగ్ స్టేషన్లను ఆదివారం పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ఇల్లంతకుంట పోలింగ్‌స్టేషన్‌కు ఓటు వేయడానికి వచ్చిన 95 ఏళ్ల వృద్ధురాలు భీమనాతిని లక్ష్మిని పలకరించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాలు తనిఖీ
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక, నీలోజిపల్లి, బోయినపల్లి, విలాసాగర్ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మహేశ్ బీ గీతే పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. డీఎస్పీ నాగేంద్రచారి, వేములవాడరూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై ఎన్.రమాకాంత్ ఉన్నారు.


