సచ్చినట్లే లెక్క
నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా ఓటేసి వస్తాను. ఊరిలో ఉండి ఓటేయకుంటే సచ్చినట్లే లెక్క కదా. పానం పోయేంత వరకు ఓటు వేసుడే. చాత కాకపోయినా బడికాడికి పోయి ఓటు సి వస్తే సంతోషం అనిపిస్తుంది. ఓట్లు ఊకే రావు కదా. ఎప్పుడో ఓసారి వచ్చే ఓటును కూడా వేయకుంటే ఎట్లా. అందుకే కష్టమైనా.. ఈడిదాకా వచ్చి ఓటేసిపోతున్నా.
– ఆకునూరి మల్లవ్వ, తంగళ్లపల్లి
40 ఏళ్లుగా ఓటు వేస్తున్నా..
నాకు ఓటు పుట్టినప్పటి నుంచి ఎన్నడూ మరవలేదు. ఓటు వేయకుండా ఏనాడు ఇంట్లో ఉండలేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు 40 ఏళ్లకుపైగా ఓటు వేస్తున్న. ఎవరు ఏమనుకున్నా పానం మంచిగా లేకున్నా ఓటు వేసి వస్తా. ఎవరు గెలిసినా ఒక్కటే. నా ఓటు మాత్రం తప్పకుండా వేస్తా. నాకు బుద్ధి తెలిసిన నాటి నుంచి ఇంతే.
– గుంటి మల్లయ్య, బోయినపల్లి
ఎవరికీ చెప్పొద్దు
నాకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి వేస్తూనే ఉన్నా. ఎవరో ఒక్కరు గెలుస్తారు. సంతోషం అనిపిస్తుంది. ఎవరికీ ఓటు వేశారని, ఏ గుర్తుకు వేశారని ఎవరూ అడిగినా నేను చెప్పను. ఎందుకంటే ఓటు రహస్యం. ఎవరికీ వేశామో బయటకు చెప్పాల్సిన పని లేదు. మనసులో ఉంటే చాలు. నేను ఓటు వేసిన వ్యక్తి గెలిచినా.. ఓడినా నాకు సంబంధం లేదు. ఓటుమాత్రం మరిచిపోకుండా వేస్తాను.
– కొండ విఠల్, తంగళ్లపల్లి
ఎట్ల మరిచిపోతా
ఓటు వేసుడు ఎట్లా మరిచిపోతా. మొన్నటి దాకా ఓటు వేయమని పోటీ చేసినోళ్లు అందరూ ఇంటికొచ్చిపోయిరి. చేతులు జోడించి దండం పెట్టిరి. నేను ఓటు వేసినా.. వేయకున్నా.. ఎవరో ఒక్కరు గెలుస్తరు. అందరూ గెలువరు కదా. నేను ఇప్పటి వరకు ఏ ఎన్నికలు జరిగినా ఓటు వేసిన. పానం ఉన్నంత వరకు ఓటు వేస్తా. ఎవరూ గెలిచినా మనోళ్లే. చేతకాకున్నా బడిదాకా పోయి ఓటు వేసి వస్తున్న. – గోగు ఎల్లవ్వ, తాడూరు
సచ్చినట్లే లెక్క
సచ్చినట్లే లెక్క
సచ్చినట్లే లెక్క


