పల్లెపోరు
న్యూస్‌రీల్
రెండో విడత ఎన్నికల స్వరూపం
ఓటరు గుర్తింపుకార్డు లేకున్నా..
ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
77 గ్రామాల్లో
● నేడు మలివిడత పంచాయతీ ఎన్నికలు ● మూడు మండలాలు.. 77 గ్రామాలు ● బ్యాలెట్ బాక్స్‌లతో పల్లెలకు వెళ్లిన సిబ్బంది
సిరిసిల్ల: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఇల్లంతకుంట, బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లోని 88 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటికే 11 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 77 గ్రామాల్లోని సర్పంచ్ స్థానాలకు 279 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే 228 వార్డుస్థానాలు ఏకగ్రీవం కావడంతో 530 వార్డుస్థానాలకు 1323 మంది బరిలో నిలిచారు. ఈమేరకు ఆయా గ్రామాలకు 910 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,093 మంది ఓపీవోలు ఎన్నికల సామగ్రితో తరలివెళ్లారు. ఎన్నికల ఏర్పాట్లను, సామగ్రి పంపిణీని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ పరిశీలించారు. మరో వైపు ఎన్నికలకు 722 మంది పోలీసులు బందోబస్తు చేపడుతున్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
పల్లెలకు వెళ్లిన ఎన్నికల సిబ్బంది
ఇల్లంతకుంట, బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లో రెండో విడత జరిగే ఎన్నికల నిర్వహణకు 910 మంది(పీవో) ప్రిసైడింగ్ అధికారులు, 1,093 మంది (ఓపీవోలు) ఇతర ఎన్నికల అధికారులు పల్లెలకు శనివారం తరలివెళ్లారు. ఎన్నికల సామగ్రి, అధికారులు, సిబ్బందిని తరలించేదుకు బోయినపల్లి మండలంలో నాలుగు జోన్లు, 8 రూట్లు, ఇల్లంతకుంటలో ఐదు జోన్లు, 8 రూట్లు, తంగళ్లపల్లి మండలంలో ఐదు జోన్లు, 10 రూట్లను సిద్ధం చేశారు. మూడు మండలాల్లో 530 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఎలాంటి శిబిరాలు లేకుండా ముందుచూపుతో సరిహద్దులను ఏర్పాటు చేశారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల పరిశీలన
ఇల్లంతకుంట/తంగళ్లపల్లి/బోయినపల్లి: రెండో విడత ఎన్నికలు జరిగే ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయినపల్లి మండలాల్లోని గ్రామాలకు పోలింగ్ సిబ్బంది తరలివెళ్లారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయినపల్లి మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది సాయంత్రం తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బస్సుల్లో తరలివెళ్లారు. ఇల్లంతకుంట మండలంలో 245 పోలింగ్ స్టేషన్లు, బోయినపల్లి మండలంలో 212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీని అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఆర్డీవో రాధాభాయి, ఎంపీడీవోలు శశికళ, జయశీల పరిశీలించారు.
మండలాలు: బోయినపల్లి,
ఇల్లంతకుంట, తంగళ్లపల్లి
గ్రామాలు : 77, ఓటర్లు: 1,11,130
రూట్లు: 26, జోన్లు: 14
పోలింగ్ సిబ్బంది: 2003
పోలీసు సిబ్బంది: 722
క్విక్ రియాక్షన్ టీమ్స్: 7
స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు: 03
క్రిటికల్ కేంద్రాల: 14, సెన్సిటివ్ కేంద్రాలు: 26
ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుండి... ఓటరు గుర్తింపుకార్డు(ఎపిక్ కార్డు) లేకున్నా ఓటు వేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. 18 రకాల ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక్కటి ఉంటే చాలని స్పష్టం చేశారు. ఆధార్‌కార్డు, ఇండియన్ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీచేసిన ఉద్యోగి గుర్తింపుకార్డులు, బ్యాంకు, తపాలా కార్యాలయం జారీచేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, పాన్‌కార్డు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్‌ఏఐ) కింద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(ఆర్‌జీఐ) జారీ చేసిన స్మార్ట్‌కార్డు, శాసనసభ, శాసనమండలి జారీచేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారిక గుర్తింపు కార్డులు, ఫొటోతో కూడిన స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపుకార్డు, లోక్‌సభ, రాజ్యసభ జారీచేసిన ఎంపీ గుర్తింపుకార్డు, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు జారీచేసిన ఫొటోలతో కూడిన ఉపాధిహామీ జాబ్‌కార్డు, కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డ్, రేషన్‌కార్డు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువీకరణపత్రాలు, పెన్షన్ పత్రాలు, ఆయుధాల లైసెన్స్, దివ్యాంగ ఽధ్రువీకరణపత్రం, పట్టాదారు పాస్‌బుక్ వంటి వాటిని ఓటు వేసేందుకు వినియోగించుకోవచ్చు.
బోయినపల్లి
గ్రామాలు: 23
ఓటర్లు: 30,505
ఏకగ్రీవ గ్రామాలు: 0
ఎన్నికలు జరిగే గ్రామాలు: 23
పోటీలో ఉన్న సర్పంచ్
అభ్యర్థులు: 90
ఎన్నికలు జరిగే వార్డులు: 166
పోటీలో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులు: 391
ఎన్నికల సిబ్బంది: 548
తంగళ్లపల్లి
గ్రామాలు: 30
ఓటర్లు: 40,079
ఏకగ్రీవ గ్రామాలు: 03
ఎన్నికలు జరిగే గ్రామాలు: 27
పోటీలో ఉన్న సర్పంచ్
అభ్యర్థులు: 110
ఎన్నికలు జరిగే వార్డులు: 174
పోటీలో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులు: 478
ఎన్నికల సిబ్బంది: 684
ఇల్లంతకుంట
గ్రామాలు: 35
ఓటర్లు: 40,546
ఏకగ్రీవ గ్రామాలు: 08
ఎన్నికలు జరిగే గ్రామాలు: 27
పోటీలో ఉన్న సర్పంచ్
అభ్యర్థులు: 79
ఎన్నికలు జరిగే వార్డులు: 190
పోటీలో ఉన్న వార్డు సభ్యుల అభ్యర్థులు: 454
ఎన్నికల సిబ్బంది: 771
పల్లెపోరు
పల్లెపోరు
పల్లెపోరు
పల్లెపోరు
పల్లెపోరు
పల్లెపోరు


