అర్హులు ఓటుహక్కు వినియోగించుకోవాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
ఇల్లంతకుంట(మానకొండూర్)/తంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామపంచాయతీ ఎన్నికల్లో అర్హులు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ కోరారు. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలం సారంపల్లిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను శనివారం సందర్శించి మాట్లాడారు. ఇల్లంతకుంట, బోయిన్పల్లి, తంగళ్లపల్లి మండలాల్లోని 77 జీపీలలో సర్పంచ్ స్థానాలకు, 530 వార్డు స్థానాలకు ఈనెల 14న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మూడు మండలాల్లో 910 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,093 మంది ఓపీవోలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. మూడో విడత ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం సిద్ధం చేసిన వీల్‌చైర్, ఇతర సౌకర్యాలు పరిశీలించారు. సీపీవో శ్రీనివాసాచారి, తహసీల్దార్ జయంత్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీసీవో రామకృష్ణ, నోడల్ అధికారి భారతి, ఇల్లంతకుంట తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీవో శశికళ పాల్గొన్నారు.


