రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
ఇల్లంతకుంట(మానకొండూర్): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. ఇల్లంతకుంట పల్లె దవాఖానాను శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ, ఐపీ, డాగ్‌బైట్, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆస్పత్రి డాక్టర్ రసజ్ఞ, స్టాఫ్‌నర్స్ కవిత తదితరులు ఉన్నారు.
బోయినపల్లి(చొప్పదండి): ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని వేములవాడ ఆర్డీవో రాధాబాయి ఆదేశించారు. మండల కేంద్రంలోని హైస్కూల్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. బ్యాలెట్‌బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సక్రమంగా తరలి వెళ్లేలా చూడాలని ఆదేశించారు. ఎంపీడీవో జయశీల, ఎంఈవో శ్రవణ్‌కుమార్, టౌన్ సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎన్నికల్లో ఓటర్లకు మద్యం పంచేందుకు అక్రమంగా తరలిస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శనివారం పట్టుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారంతో మండలంలోని రాచర్లగొల్లపల్లి శివారులోని కిష్టంపల్లికి వెళ్లే దారిలో ఆటోలో రూ.లక్ష విలువైన మద్యంను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న గొల్లపల్లికి చెందిన చల్ల బాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసి, ఆటోను చేశారు. దాడిలో ఆర్‌ఐ శ్రావణ్‌కుమార్, పోలీస్ సిబ్బది పాల్గొన్నారు.
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బ్యాలెట్ బాక్స్‌లు, ఎన్నికల సామగ్రిని తీసుకెళ్లేందుకు సిబ్బంది ఇబ్బంది పడ్డారు. స్థానిక హైస్కూల్ మైదానంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లోకి బస్సులు వచ్చే అవకాశం లేకపోవడంతో దాదాపు అర కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఎన్నికల సామగ్రితో అంతదూరం నడిచివెళ్లేందుకు ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడ్డారు.
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లలో 1977 నుంచి న్యాయస్థానంగా ఉన్న భవనం స్థానంలో నూతన కోర్టు భవన నిర్మాణానికి అనుమతులు లభించడంతో పాత భవనాన్ని కూల్చివేశారు. సుమారు ఐదు దశాబ్దాలపాటు సేవ లందించిన ఈ భవనం ప్రస్తుతం ఓ శిథిల జ్ఞాపకం. మరో రెండేళ్లలో నూతన భవనం రూపొందనుంది.
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
వేములవాడఅర్బన్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రెండు కేంద్రాలలో 261 మంది విద్యార్థులకు 57 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల సీఎస్‌లుగా రాజారత్నం, బన్నాజీలు వ్యవహరించారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి


