కార్మికుల ప్రాణాలతో చెలగాటం
అర్హత లేని వ్యక్తులతో పరీక్షలు చేయించడం కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. సంస్థ ద్వారా కార్మికులకు అందించిన రిపోర్టులతో ఎక్కడ వైద్యం చేయించుకోవాలి. కార్మికులు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే అక్కడ మళ్లీ పరీక్షలు చేస్తున్నారు. సంస్థ ద్వారా సిరిసిల్లకు చెందిన ఓ డాక్టర్‌ను నియమించి ఏమి లాభం. శిబిరాలు నిర్వహించకుండా కేవలం రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అవి కూడా ఇతర రంగాలకు చెందిన వ్యక్తుల నమూనాలు తీస్తున్నారు.
– బియ్యంకార్ శ్రీనివాస్, సంఘటిత,
అసంఘటిత రంగాల ఎంప్లాయీస్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు
జిల్లాలో భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల సంక్షేమానికి ఆరోగ్య పరీక్షలు పారదర్శకంగా చేపడుతున్నాం. అర్హత లేని వ్యక్తులతో రక్త నమూనాలు తీయించడం లేదు. 2023 నుంచి ఇప్పటి వరకు సుమారు 35వేల మంది శాంపిల్స్ సేకరించి, రిపోర్టులు అందజేశాం. జిల్లాలో 7 బృందాల్లో పది మంది అర్హులైన సిబ్బందితో శాంపిల్స్ సేకరిస్తున్నాం. ఈసీజీ, పీఎఫ్‌టీ, ఆడియో విజన్ వంటి పరీక్షలకు చిన్నసైజు ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నాం.
– భాస్కర తిరుపతి,
డివిజనల్ మేనేజర్


