ఎన్నికల స్వరూపం మారింది
సిరిసిల్ల: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి పల్లెలు అభివృద్ధి చెంది పచ్చగా ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం సాగుతోంది. ఆదివారం జరిగే రెండో విడత ఎన్నికలతో పల్లెలు సందడిగా మారాయి. నాలుగున్నర దశాబ్దాల కిందట తొలితరం సర్పంచులుగా పనిచేసిన వారెందరో ఉన్నారు. అప్పటి పల్లె వ్యవస్థ, ఎన్నికల విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. నోటుస్వామ్యం వర్ధిల్లుతున్న నేటి రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. డబ్బులు, మద్యమే ఇప్పటి ఎన్నికలను శాసిస్తూ పల్లెల్లో అశాంతికి కారణమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు కులసంఘాలను కూడగడుతూ.. యువజన సంఘాలకు గాలం వేస్తూ.. మహిళా సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. పార్టీ రహితంగా సాగాల్సిన గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులను అద్ది అభ్యర్థులు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. నాటి ఎన్నికల తీరు.. నేటి ఎన్నికల పరిణామాలను గమనిస్తున్న వారెందరో ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో విలువ ఉంది. అలాంటి ఓటును అమ్ముకునే, కొనుగోలు చేసే సంస్కృతి తొలితరం సర్పంచులకు మనోవేదన కలిగిస్తోంది. నాటి సర్పంచుల మనో‘గతం’ఇదీ.
నోటే ఓటైంది
వ్యాపారంగా రాజకీయాలు
ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు
తొలితరం సర్పంచుల మనో‘గతం’
ఎన్నికల స్వరూపం మారింది


