పన్నెండు గంటలు పనిచేస్తున్నాం
నేనే ప్రింటింగ్ రంగంలో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నా. ఎనిమిదేళ్ల క్రితం సొంతంగా ఫ్లెక్సీలు, స్టిక్కర్లు ప్రింటింగ్ స్టూడియో నడిపిస్తున్నా. మామూలు రోజుల్లో ఆర్డర్లు కన్నా ఇప్పుడు మూడింతలు పెరిగాయి. పక్షం రోజులుగా సర్పంచ్ ఎన్నికలతో వచ్చే గిరాకీతో నేను, మరో నలుగురు సిబ్బందిమి పన్నెండు గంటలపాటు పనిచేయాల్సి వస్తుంది. ఆర్డర్లు చెప్పిన సమయానికి అందిస్తున్నాం.
– నందగిరి మహేశ్, ఫ్లెక్సీ ప్రింటర్
నలభై ఏళ్లుగా ప్రింటింగ్ రంగంలో..
మేము నలభై ఏళ్లుగా ప్రింటింగ్‌ప్రెస్ రంగంలో పనిచేస్తున్నాం. ఇద్దరం 20 ఏళ్ల క్రితం సొంతంగా ప్రెస్ నిర్వహిస్తున్నాం. బ్యాలెట్స్, పోస్టర్లు, కరపత్రాలు ప్రింటింగ్ చేస్తున్నాం. గుర్తులు కేటాయించిన రోజు, తెల్లవారి రోజు పని ఎక్కువగా ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ మొదలుకొని ప్రతిరోజు 30 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. ఇది మామూలు రోజుల కన్నా మూడింతలు ఎక్కువ. ఇద్దరం కలిసి రోజూ పన్నెండు గంటలు పనిచేయాల్సి వస్తుంది.
– కట్కం ఉపేందర్
తీరిక లేకుండా పని ఉంటుంది
ఎన్నికల రాకతో మాకు పని బాగా ఉంటుంది. ఆర్డర్లమీద ఆర్డర్లుతో క్షణం తీరిక లేకండా ఉంటుంది. మా దగ్గర కండువాలు, జెండాలు, బ్యానర్లు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు, పోస్టర్లు, అన్ని రకాల ప్రింటింగ్ పనిచేస్తాం. పక్షం రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు 15 గంటలపాటు పనిచేస్తేనే ఆర్డర్లు సమయానికి ఇవ్వగలుగుతున్నాం. 23 ఏళ్లుగా స్క్రీన్‌ప్రింటింగ్ పనిచేస్తున్నా. నలుగురు వర్కర్లతో కలిసి గోదాంలో ప్రింట్ చేసి అందిస్తున్నాం. సర్పంచ్ ఎన్నికల గిరాకీ బాగా ఉంది.
– మంచికట్ల శ్రీనివాస్, స్క్రీన్ ప్రింటర్
సౌండ్ సిస్టమ్‌కు డిమాండ్
సర్పంచ్ ఎన్నికల్లో మైక్‌లు, సౌండ్ సిస్టమ్‌కు డిమాండ్ ఉంది. మా తాత మొదలుకుని నాన్న నేను కలిసి 60 ఏళ్లుగా సిరిసిల్లలో మైక్‌సౌండ్, లైటింగ్, టెంట్‌హౌస్, సీలింగ్(ఈవెంట్స్), అనౌన్స్‌మెంట్ పనిచేస్తున్నాం. ఉదయం 7–30 గంటలు మొదలుకుని రాత్రి 10 గంటల వరకు పనిచేస్తున్నాం. మాతోపాటు ముగ్గురు వర్కర్లకు చేతినిండా పని ఉంటుంది.
– షేక్ షరీఫ్, మైక్ సౌండ్స్ నిర్వాహకుడు
పన్నెండు గంటలు పనిచేస్తున్నాం
పన్నెండు గంటలు పనిచేస్తున్నాం
పన్నెండు గంటలు పనిచేస్తున్నాం


