అర్చనకు గోల్డ్ మెడల్
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగ క్రీడాకారిణి అంతర్జాతీయ పారా త్రో బాల్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించింది. చంద్రంపేటకు చెందిన మిట్టపల్లి అర్చన శ్రీలంకలో ఈనెల 6, 7 తేదీలలో జరిగిన ఫస్ట్ సౌత్ ఆసియన్ పారా త్రో బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. గోల్డ్‌మెడల్ సాధించి శనివారం స్వగ్రామానికి చేరుకోగా.. సిరిసిల్ల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సత్కరించారు. ప్రస్తుతం సీ్త్ర శిశు సంక్షేమ వయోవృద్ధులు, దివ్యాంగుల శాఖలో ‘మల్టీ టాస్క్’ విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు. అర్చనను సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీలంకలో జరిగిన పోటీలకు ప్రభుత్వం పంపింది. వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది శాంతి ప్రకాశ్‌శుక్లా, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధాబాయి, విశ్రాంత ఉపన్యాసకులు ఝాన్సీశుక్లా, యెల్లె సువర్ణ, సీనియర్ పాత్రికేయులు తడుక విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
వేములవాడలో నకిలీనోటు కలకలం?
వేములవాడ: మున్సిపల్ పరిధిలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీనోటు కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు తీసుకున్న రుణాలను ప్రతీ నెల చెల్లించాల్సి ఉంటుంది. నగదు చెల్లించే క్రమంలో రూ.500 నకిలీ నోటు రావడంతో ఆందోళనకు గురయ్యారు. గతంలో ఓసారి రూ.500 నోటు నకిలీది వచ్చిందని, ఇది రెండోసారి కావడంతో మహిళా సంఘాల ప్రతినిధులకు భయాందోళన గురవుతున్నారు.


