ఆరు గంటలు పనిచేస్తున్నా
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటుతో ఉపాధి దొరుకుతుంది. ప్రింటర్స్ నుంచి ఫ్లెక్సీలు తీసుకొచ్చి ఫ్రేమ్‌లకు అతికించడం, గిరాకీ చెప్పిన చోట్లలో కట్టేస్తున్నాం. ఒక్క ఫ్లెక్సీ కడితే రూ.150 నుంచి రూ.200 ఇస్తారు. సాధారణ రోజుల్లో నెలలో 10 సార్లు పని దొరికేది. ఇప్పుడు పదిహేను రోజులుగా నిరంతరం పని ఉంటుంది. ప్రతీ రోజు 6గంటలకు పైగా ఫ్లెక్సీల ఏర్పాటులో బిజీగా ఉంటున్నాం.
– యెల్లె లక్ష్మణ్, ఫ్లెక్సీ కార్మికుడు
300 పాటలు రికార్డు చేశాం
ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ప్రచారానికి మూడు వందల పాటలను రికార్డు చేశాం. నాకు 30 ఏళ్లుగా రికార్డింగ్ రంగంలో అనుభవం ఉంది. ఇరవై ఏళ్ల క్రితం సిరిసిల్ల లో రికార్డింగ్ స్డూడియో ఏర్పాటు చేసిన. అభ్యర్థులు కేవలం తమ కరపత్రాలు, మేనిఫెస్టో అందిస్తే చాలు వారిపై పాటలు కట్టి రికార్డు చేసి పంపిస్తాం. మా స్డూడియోలో ఆరుగురు రచయితలు, ఆరుగురు సింగర్స్, ముగ్గురు కోరస్ కళాకారులు ఉన్నారు. పాటల రాయడం, ప్లేబ్యాక్, సంగీతం, రికార్డింగ్ అంతా మాదే. చాలా మంది అభ్యర్థులకు ప్రచార బాణీలు కూడా అందిస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలు గతంలో కన్నా ఎక్కువ గిరాకీ వస్తుంది. – ఎండీ సత్తార్,
రికార్డింగ్ స్డూడియో నిర్వాహకుడు
ఆరు గంటలు పనిచేస్తున్నా


