కాంగ్రెస్‌లో చేరికలు
వేములవాడ: వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ ఉపసర్పంచ్‌గా ఎన్నికై న వేముల నాగరా జు, మాజీ సర్పంచ్ పెద్ది నవీన్ శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. వారికి ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గ్రామాభివృద్ధికి పాడుపడాలి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను తనను కలిసిన నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని సూచించారు. అవినీతి లేని పాలన అందించాలని సూచించారు.
ప్రభుత్వ విప్‌ను కలిసిన రుద్రంగి పాలకవర్గం
రుద్రంగి(వేములవాడ): నూతనంగా ఎంపికై న రుద్రంగి పాలకవర్గం సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిశారు. సర్పంచ్ గండి లక్ష్మీనారాయణ, పాలకవర్గ సభ్యులకు విప్ శుభాకాంక్షలు తెలిపారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తర్రె లింగం, రుద్రంగి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ చైర్మన్ కొమిరె శంకర్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, నాయకులు పల్లి గంగాధర్, ఎర్రం గంగనర్సయ్య, ధర్న మల్లేశం పాల్గొన్నారు.


