గ్రామాల అభివృద్ధే ప్రాధాన్యం
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి(చొప్పదండి): సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ద్యేయంగా పనిచేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని కోరెం, దేశాయిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యరులకు మద్దతుగా శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్‌రెడ్డి, ధనుంజయ్, ఒంటెల గోపాల్‌రెడ్డి, పులి హన్మాండ్లు, సురేందర్‌రెడ్డి, కొంకటి మధు పాల్గొన్నారు.
ఆరోగ్యసేవల సమాచారం కోసం హెల్ప్‌డెస్క్
సిరిసిల్లకల్చరల్: యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భాన్ని పురస్కరించుకుని రోగులకు అందించే వైద్యసేవల సమాచారాన్ని ఒకే చోటు నుంచి పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ప్రారంభిస్తున్నట్లు లోక్ అదాలత్ సభ్యుడు ఆడెపు వేణు తెలిపారు. ప్రభుత్వ ప్రధానాస్పత్రి ఆవరణలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రభుత్వరంగ ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రవీణ్‌కుమార్, సీఎస్ సుమన్‌మోహన్‌రావు, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ మల్లేశ్‌యాదవ్, ప్యానెల్ న్యాయవాది అరుణ, పీవో డాక్టర్ నయీం జా, జూనియర్ పారా లీగల్ వలంటీర్లు విక్రమ్, సింధూజ పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో రాణించాలి
సిరిసిల్ల అర్బన్: జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో రాణించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల రమేశ్ కోరారు. ఈనెల 16 నుంచి 21 వరకు రాజస్థాన్‌లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు బాల, బాలికల జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్, ప్రధాన కార్యదర్శి రాందాస్, కోడం శ్రీనివాస్, శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు.
ముస్తాబాద్‌లో 20 పోస్టల్ బ్యాలెట్లు
ముస్తాబాద్: మండల పరిషత్‌లో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకుంటున్నారు. శుక్రవారం 20 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు వేశారని ఎంపీడీవో లచ్చాలు తెలిపారు. ఈనెల 17 వరకు పోస్టల్ బ్యాలెట్లు స్వీకరిస్తామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెటు ద్వారా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. మండల పరిషత్‌లో హెల్ప్‌డెస్కును ఏర్పాటు చేశామన్నారు.
15న జిల్లా క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు
సిరిసిల్ల అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 16, 18, 20 క్రాస్‌కంట్రీ పోటీలు సిరిసిల్లలోని మినీస్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బొజ్జ చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 15న మున్సిపల్ పరిధిలోని రాజీవ్‌నగర్ మినీస్టేడియం దగ్గరలోని బైపాస్‌రోడ్డు వద్ద పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికై న 32 మంది క్రీడాకారులను హైదరాబాద్‌లో జరిగే పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
గ్రామాల అభివృద్ధే ప్రాధాన్యం
గ్రామాల అభివృద్ధే ప్రాధాన్యం
గ్రామాల అభివృద్ధే ప్రాధాన్యం


