న్యాయ విజ్ఞాన సదస్సు
వేములవాడఅర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో సార్వత్రిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య సేవలు, హక్కులపై అవగాహన ఉండాలన్నారు. ఆసుపత్రిలో న్యాయ సహాయకేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్యులు అనిల్‌కుమార్, తిరుపతి, సంతోష్‌చారి, లోక్ అదాలత్ సభ్యుడు వేణు ఉన్నారు.
హెచ్‌పీవీ టీకాపై అవగాహన
సిరిసిల్లటౌన్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత ఆధ్వర్యంలో హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాధి నిరోధక టీకాపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌వో ఆఫీసులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 14 ఏళ్లు నిండిన బాలికలకు గర్భాశయం, రొమ్ము, నోటి క్యాన్సర్‌లను నిరోధించగల టీకాపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి సంపత్‌కుమార్, వైద్యులు అనిత, డెమో రాజకుమార్, నవీన పాల్గొన్నారు.
మద్యం అక్రమ రవాణాపై నిఘా
సిరిసిల్ల క్రైం: గ్రామపంచాయతీ ఎన్నికలు సాగుతు న్న నేపథ్యంలో జిల్లాలో అక్రమ మద్యం రవాణా, విక్రయాలు, కొనుగోళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల సందర్భంగా మద్యం హోల్‌సేల్ అమ్మకాలు పెరుగుతాయన్న సమాచారంతో తనిఖీలు విస్తృతంగా చేపట్టినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు 90 కేసులు నమోదు చేసి, 1,337 లీటర్ల మద్యంను సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
న్యాయ విజ్ఞాన సదస్సు


