రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
● వాహనాల వేగ నిర్ధారణకు స్పీడ్‌గన్స్ ● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, వాహనాల అతి వేగాన్ని నిర్ధారించేందుకు స్పీడ్‌గన్స్ కొనుగోలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఇన్‌చార్జి కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు అధికంగా జరగడానికి గల కారణాలను తెలుసుకున్నారు. గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించాలని ఆదేశించారు. అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను చెక్ చేసేందుకు స్పీడ్‌గన్స్ కొనుగోలు చేయాలన్నారు. రోడ్లను ఆనుకుని ఉన్న పాతబావులను పూడ్చివేయాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి, జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, డీపీవో షరీఫొద్దీన్, పంచాయతీరాజ్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఆర్టీఏ నాన్ అఫిషియల్ మెంబర్ సంగీతం శ్రీనాథ్, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.


