375 ఓట్లు.. ఆరుగురు అభ్యర్థులు | - | Sakshi
Sakshi News home page

375 ఓట్లు.. ఆరుగురు అభ్యర్థులు

Dec 13 2025 7:23 AM | Updated on Dec 13 2025 7:23 AM

375 ఓట్లు.. ఆరుగురు అభ్యర్థులు

375 ఓట్లు.. ఆరుగురు అభ్యర్థులు

● కొత్త పంచాయతీలో పోటాపోటీ ● అందరి దృష్టి రాచర్ల బాకురుపల్లిపైనే

● కొత్త పంచాయతీలో పోటాపోటీ ● అందరి దృష్టి రాచర్ల బాకురుపల్లిపైనే

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రస్తుత స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబాకురుపల్లి గ్రామపంచాయతీపైనే అందరి దృష్టి ఉంది. తక్కువ ఓట్లు ఉన్న ఈ పంచాయతీ పోరులో ఆరుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొత్త పంచాయతీలో నూతన ఉత్సాహంతో పలువురు బరిలో ఉండి తమకు అవకాశం కల్పించాలని ఓటర్‌ దేవుళ్లను వేడుకుంటున్నారు. చిన్న గ్రామపంచాయతీలో పెద్ద పోరు జరుగుతుండడంతో విజయం ఎవరిని వర్తిస్తుందో వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే ఈ గ్రామపంచాయతీలో నలుగురు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌ స్థానానికి మాత్రం తగ్గేదే లేదంటూ.. 375 ఓట్లకు ఆరుగురు అభ్యర్థులు కొట్లాడుతున్నారు. ఈ పోరు జిల్లాలోనే ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement