టెక్స్‌టైల్ పార్క్‌లోని పరిశ్రమలు తెరిపించాలి
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఏర్పడిన టెక్స్‌టైల్ పార్క్‌లోని పరిశ్రమలు మూతబడడం శోచనీయమని తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్ పేర్కొన్నారు. టెక్స్‌టైల్ పార్కును శుక్రవారం సందర్శించి, కార్మికులతో మాట్లాడారు. వేలాది మంది పనిచేసిన టెక్స్‌టైల్‌పార్క్‌లో నేడు 200 మందికి కూడా ఉపాధి కల్పించకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలకు ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ అందించకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పించాలని, కనీస వేతనం నెలకు రూ.26వేలు వచ్చేలా నిర్ణయించాలని కోరారు. నాయకులు మూషం రమేశ్, కోడం రమణ, మిట్టపల్లి రాజమౌళి, టెక్స్‌టైల్ పార్క్ అధ్యక్షుడు కూచన శంకర్, నాయకులు గడ్డం రాజశేఖర్, కార్మికులు జెల్ల సదానందం, ఆకుబత్తిని శ్రీకాంత్, రాజమల్లు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


