కట్టుదిట్టమైన భద్రత
● ఎస్పీ మహేశ్ బీ గీతే
కోనరావుపేట(వేములవాడ): మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌ను బుధవారం సందర్శించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్ జరిగే సమయం, ఓట్ల లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూట్ మొబైల్ పోలీస్ అధికారులు నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ, పోలింగ్ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్తపడాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. డీఎస్పీ నాగేంద్రచారి, ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఆర్‌ఐ మధుకర్, ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చందుర్తి(వేములవాడ): చందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల విధులు అంకితభావంతో న నిర్వర్తించాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలోని మూడపల్లి, నర్సింగపూర్, చందుర్తి, జోగాపూర్, సనుగుల, లింగంపేట గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు వెంకటేశ్వర్లు, మొగిలి, మధుకర్, నటేశ్, చందుర్తి ఎస్సై రమేశ్ ఉన్నారు.


