76 పల్లెల్లో పంచాయతీ
తొలివిడత ఎన్నికల స్వరూపం..
● నేడు తొలివిడత ఎన్నికలు● ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ● 76 గ్రామాల్లో 295 మంది సర్పంచ్ అభ్యర్థులు ● 521 వార్డుల్లో 1,377 మంది
వేములవాడలో సామగ్రి సరిచూసుకుంటున్న సిబ్బంది
గ్రామాలు: 10
ఓటర్లు: 13,665
ఏకగ్రీవ గ్రామాలు : 7
ఎన్నికలు జరిగే గ్రామాలు: 3
పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు : 10
పోటీలో ఉన్న వార్డుసభ్యుల
అభ్యర్థులు : 91
పోలింగ్ సిబ్బంది : 246
గ్రామాలు: 19
ఓటర్లు: 28,094
ఏకగ్రీవ గ్రామాలు: 0
ఎన్నికలు జరిగే గ్రామాలు: 19
పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 64
పోటీలో ఉన్న వార్డు సభ్యుల
అభ్యర్థులు: 347
పోలింగ్ సిబ్బంది: 468
గ్రామాలు: 11
ఓటర్లు: 18,492
ఏకగ్రీవ గ్రామాలు: 0
ఎన్నికలు జరిగే గ్రామాలు: 11
పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 47
పోటీలో ఉన్న వార్డు
సభ్యుల అభ్యర్థులు: 218
పోలింగ్ సిబ్బంది: 304
గ్రామాలు: 17
ఓటర్లు: 18,825
ఏకగ్రీవ గ్రామాలు : 0
ఎన్నికలు జరిగే గ్రామాలు : 17
పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు : 52
పోటీలో ఉన్న వార్డుసభ్యుల
అభ్యర్థులు : 262
పోలింగ్ సిబ్బంది : 371
గ్రామాలు : 28
ఓటర్లు : 35,225
ఏకగ్రీవమైన గ్రామాలు : 02
ఎన్నికలు జరిగే గ్రామాలు : 26
పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 122
పోటీలో ఉన్న వార్డుసభ్యుల
అభ్యర్థులు: 459
పోలింగ్ సిబ్బంది: 646
సిరిసిల్ల: ప్రశాంత పల్లెల్లో ఎన్నికల సెగలు రేగాయి. జిల్లాలోని పల్లెల్లో ఎన్నికల పోరు బహుముఖంగా సాగుతోంది. తొలి విడత ఎన్నికలు ఐదు మండలాల్లో గురువారం జరుగుతున్నాయి. 85 గ్రామాల్లో సర్పంచు స్థానాలకు, 758 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ జారీ కాగా.. నామినేషన్ల పర్వం, నామినేషన్ల ఉపసంహరణ ముగిసేనాటికి 9 గ్రామాల్లో సర్పంచులు, 237 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 76 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు 295 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా గ్రామాల్లోని 521 వార్డుసభ్యుల స్థానాలకు 1,377 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామాల్లో, వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు 2,035 మంది పోలింగ్ సిబ్బందితో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐదు మండలాల్లోని 1,14,301 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
సమస్యాత్మక పల్లెల్లో కట్టుదిట్టమైన భద్రత
తొలివిడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో 25 సమస్యాత్మక గ్రామాలు ఉండగా ఇందులో నాలుగు అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. గత ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో జరిగిన గొడవలను అంచనా వేస్తూ పోలీసులు సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. అన్ని గ్రామాల్లోనూ పోలింగ్ కేంద్రాలకు వందమీటర్ల దూరంలో ఎవరినీ ప్రచారం చేయనీయకుండా కట్టడి చేయనున్నారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో మొబైల్ సాయుధ పోలీస్ బృందాలు, రిజర్వు బృందాలు, ఐదు అంచెల పోలీసు రక్షణను 722 మంది సిబ్బందితో నిర్వహిస్తున్నారు.
నేడు ఎన్నికలు
ఎన్నికలు జరిగే గ్రామాలకు బుధవారం పోలింగ్ సామాగ్రితో సిబ్బంది చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రితో పల్లెలకు చేరారు. గురువారం ఉదయం 7 నుంచే పోలింగ్ మొదలై, మధ్యాహ్నం ఒంటి గంటలోగా ముగుస్తుంది. భోజన విరామం తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే ఎన్నికై న అభ్యర్థులకు నోటీసులు జారీ చేసి ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
పల్లెలకు తరలిన సిబ్బంది
వేములవాడ: పంచాయతీ ఎన్నికల సామాగ్రితో సిబ్బంది బుధవారం పల్లెలకు తరలివెళ్లారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, మండల పరిషత్ ఆవరణ నుంచి వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట ఐదు మండలాలకు వెళ్లారు.
సిబ్బంది ఇలా...
మండలాలు : 05, రూట్లు : 25
పోలింగ్ సిబ్బంది : 2,250, పోలీసులు : 902
క్రిటికల్ కేంద్రాలు :61, సెన్సిటివ్ కేంద్రాలు: 51
నిర్లక్ష్యంగా ఉండొద్దు
– ఆర్డీవో రాధాభాయి
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దని ఆర్డీవో రాధాభాయి హెచ్చరించారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండల పరిషత్ ఆవరణలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఆమె బుధవారం నిర్వహించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. తహసీల్దార్లు వెంకటప్రకాశ్‌రావు, అబూబాకర్ ఉన్నారు.
మర్యాదపూర్వకంగా మెలగాలి
– అడిషనల్ ఎస్పీ చంద్రయ్య
ఓటర్లతో మర్యాదపూర్వకంగా ఉండాలని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య పోలీస్ సిబ్బందికి సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సెల్‌ఫోన్ అనుమతి లేదని, తెలిసిన వారెవ్వరికీ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని స్పష్టం చేశారు. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలింగ్ బందోబస్తు సిబ్బందికి సూచనలిచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
76 పల్లెల్లో పంచాయతీ
76 పల్లెల్లో పంచాయతీ
76 పల్లెల్లో పంచాయతీ
76 పల్లెల్లో పంచాయతీ


