డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సిద్ధం
వేములవాడ/వేములవాడఅర్బన్: పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొదటి విడత ఈనెల 11న పోలింగ్ జరిగే గ్రామాలకు ఎన్నికల సామగ్రి తరలించేందుకు మంగళవారం వేములవాడ మండల పరిషత్ ఆవరణలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సిద్ధం చేశారు. వేములవాడ, వేములవాడ రూరల్ మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ నగేశ్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్లు విజయ్‌ప్రకాశ్‌రావు, అబూబాకర్, ఎంపీడీవోలు శ్రీనివాస్, కీర్తన తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ: స్వామివారి అన్నప్రసాదం ఎలా ఉందంటూ ఆలయ ఈవో రమాదేవి భక్తులను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం రాజన్న ను దర్శించుకుని స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భోజనాలు చేస్తున్న పలువురిని శ్రీవంటలు ఎలా ఉన్నాయి, ఉద్యోగులు, సిబ్బంది పని తీరు ఎలా ఉంది’ అని తెలుసుకున్నారు. భోజనాలు రుచిగా ఉన్నాయని, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారని భక్తులు చెప్పడంతో సత్రం నిర్వాహకులు భాస్కర్, సిబ్బందిని ఈవో అభినందించారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రజిత అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు జ్వరాలతో బాధపడుతుండగా మంగళవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 92 మందికి పరీక్షలు నిర్వహించారు. 15 మందికి రక్త పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, చలి తీవ్రత నుంచి కాపాడుకునేందుకు విద్యార్థులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాచి వడబోసిన నీటిని తాగాలని, పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో జ్వరాలు ప్రబలితే తమకు సమాచారం అందించాలని కోరారు. మండల వైద్యాధికారి సరియా అంజుమ్, వైద్యులు సాయిచంద్ర, సంధ్యారాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
సిరిసిల్ల: గర్భిణులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో మంగళవారం ఆశా నోడల్ సూపర్‌వైజర్లతో సమీక్ష నిర్వహించారు. గర్భిణుల నమోదు సరిగా నిర్వహించి, హై రిస్క్ ఉన్నవారిని గుర్తించాలన్నారు. సకాలంలో ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలన్నారు. ఎంహెచ్‌ఎన్ డాక్టర్ నాగేంద్రబాబు, వైద్యులు అనిత, నహిమాజహా, డెమో రాజకుమార్, సీహెచ్‌వో శాంత, బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సిద్ధం
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సిద్ధం


