సబ్బండవర్గాలను ఏకం చేసిన కేసీఆర్
సిరిసిల్లటౌన్: అరవై ఏళ్లు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన తెలంగాణ డిసెంబర్ 9న విజయం సాధించిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ‘విజయ్ దివస్’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి పూలమాలలతో గౌరవ వందనం సమర్పించారు. జిల్లాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాడు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సబ్బండవర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళ, టీఎస్‌పీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, దార్నం లక్ష్మీనారాయణ, ఆకునూరి శంకరయ్య, గజభీంకార్ రాజన్న, దార్ల సందీప్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


