మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
● ఎస్పీ మహేశ్ బీ గితే
సిరిసిల్లక్రైం: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ మహేశ్ బీ గితే తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో 25 రూట్ మొబైల్స్, 7 జోనల్ టీమ్స్, 5 క్విక్ రియాక్షన్ టీమ్స్, 2 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాలను వదిలి వెళ్లవద్దని ఆదేశించారు. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే పైఅధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
చెక్‌పోస్ట్ తనిఖీ
రుద్రంగి: చెక్‌పోస్ట్‌ల వద్ద అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని ఎస్పీ మహేశ్ బీ గితే ఆదేశించారు. మండలకేంద్రంలోని జిల్లా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహన తనిఖీల రిజిస్టర్‌ను పరిశీలించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.


